వైద్య విద్యార్థులకు భారీగా స్టైఫండ్ పెంపు
Sakshi Education
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్ హౌస్ సర్జన్, పీజీ వైద్య విద్యార్థులకు భారీగా స్టైఫండ్ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి బుధవారం ఉత్తర్వులిచ్చారు. పెరిగిన స్టైఫండ్ ఈ ఏడాది జనవరి నుంచి అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రస్తుతం ఇస్తున్న స్టైఫండ్, పెరిగిన స్టైఫండ్ వివరాలిలా ఉన్నాయి.
కోర్సు | ప్రస్తుతం ఇస్తున్న స్టైఫండ్ (రూ) | పెంచిన స్టైఫండ్ (రూ) |
ఎంబీబీఎస్/ బీడీఎస్ (హౌస్ సర్జన్) | 15,817 | 19,589 |
పీజీ డిగ్రీ | ||
మొదటి ఏడాది | 35,589 | 44,075 |
రెండవ ఏడాది | 37,566 | 46,524 |
మూడవ ఏడాది | 39,543 | 48,973 |
పీజీ డిప్లమో | ||
మొదటి ఏడాది | 35,589 | 44,075 |
రెండవ ఏడాది | 37,566 | 46,524 |
సూపర్ స్పెషాలిటీ | ||
మొదటి ఏడాది | 39,543 | 48,973 |
రెండవ ఏడాది | 41,521 | 51,422 |
మూడవ ఏడాది | 43,497 | 53,869 |
ఎండీఎస్ కోర్సు | ||
మొదటి ఏడాది | 35,589 | 44,075 |
రెండవ ఏడాది | 37,566 | 46,524 |
మూడవ ఏడాది | 39,543 | 48,973 |
Published date : 13 Aug 2020 02:58PM