వైద్య కాలేజీల్లో నాడు-నేడు పనులకు కన్సల్టెంట్‌లు
Sakshi Education
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఆస్పత్రులకు నాడు-నేడు కింద రూ.6,174.48 కోట్లతో పనులు చేపట్టిన ప్రభుత్వం.. దీనికి గాను కన్సల్టెంట్‌లను నియమించింది.
నిర్మాణాలు, అభివృద్ధి పనులు చేసేందుకు చార్జీల కింద కన్సల్టెంట్‌లకు రూ.37.01 కోట్లుగా నిర్ణయించారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డా.కె.ఎస్.జవహర్‌రెడ్డి గురువారం ఉత్తర్వులిచ్చారు. మొత్తం 13 ఆస్పత్రులకు కన్సల్టెంట్‌లను నియమించినట్టు తెలిపారు.
Published date : 04 Sep 2020 02:24PM