స్కూల్ బస్సుల్లో హెల్త్ ప్రొటోకాల్ పాటించాలి: రవాణా శాఖ
Sakshi Education
సాక్షి, అమరావతి: విద్యార్థులను స్కూల్‌కు చేరవేసే బస్సుల్లో కచ్చితంగా హెల్త్ ప్రొటోకాల్ పాటించాలని రవాణా శాఖ సోమవారం ఉత్తర్వులిచ్చింది.
బస్సులను శానిటైజ్ చేయడం, విద్యార్థులకు థర్మల్ స్క్రీనింగ్ చేయడం, డ్రైవర్‌కు, విద్యార్థులు కూర్చునే సీట్లకు మధ్య బ్యారియర్ల ఏర్పాటు తదితర నిబంధనలన్నీ పాటించాలని రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు జీవో జారీ చేశారు.
Published date : 10 Nov 2020 02:50PM