ఫైనల్ ఎంబీబీఎస్ పార్ట్–1 ఫలితాలు విడుదల
Sakshi Education
లబ్బీపేట(విజయవాడతూర్పు): డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం పరిధిలోని తెలంగాణ వైద్య కళాశాలల ఫైనల్ ఎంబీబీఎస్ పార్ట్–1 పరీక్ష ఫలితాలను సోమవారం విడుదల చేశారు.
యూనివర్సిటీ నియమ నిబంధనల ప్రకారం గ్రేస్ మార్కులు కలిపిన తర్వాత ఫలితాలు విడుదల చేసినట్టు వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ పి.దుర్గాప్రసాదరావు చెప్పారు. ఫలితాలపై రీ టోటలింగ్ కోరే విద్యార్థులు ఒక్కో సబ్జెక్ట్‌కు రూ.2 వేల చొప్పున చెల్లించి ఈ నెల 28లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వర్సిటీ వెబ్‌సైట్‌లో ఫలితాలు చూడొచ్చని తెలిపారు.
Published date : 22 Jun 2021 01:38PM