ఫైనల్ బీడీఎస్ పరీక్ష ఫలితాలు విడుదల: ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ
Sakshi Education
లబ్బీపేట(విజయవాడ తూర్పు): డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం ఫైనలియర్ బీడీఎస్ పరీక్ష ఫలితాలను విడుదల చేసింది.
ఈ ఏడాది సెప్టెంబరు, అక్టోబరు నెలలో నిర్వహించిన పరీక్షల ఫలితాలు డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నియమ నిబంధనలననుసరించి గ్రేస్ మార్కులు కలిపిన తర్వాత విడుదల చేసినట్లు వర్సిటీ ఎగ్జామినేషన్స్ కంట్రోలర్ డాక్టర్ పి. దుర్గాప్రసాదరావు తెలిపారు. ఈ ఫలితాలతో రీ టోటలింగ్ కోరే విద్యార్థులు సబ్జెక్ట్‌కు రూ.2వేలు చెల్లించి నవంబర్30వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. విద్యార్థులు ఫలితాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
Published date : 21 Nov 2020 04:39PM