Skip to main content

పీజీ నీట్ తెలంగాణ రాష్ట్ర స్థాయి ర్యాంకులు విడుదల

సాక్షి, హైదరాబాద్: కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం మార్చి 6 (శుక్రవారం)న విడుదల చేసిన రాష్ట్ర స్థాయి పీజీ నీట్ ర్యాంకుల్లో టాప్-10లో 8 మంది అమ్మాయిలే ఉన్నారు.
జాతీయ స్థాయిలో 49వ ర్యాంక్ పొందిన ఎన్.శ్రీనిధి అనే అమ్మాయి రాష్ట్ర స్థాయిలో తొలి ర్యాంక్ సాధించింది. నీట్ పీజీ 1,200 మార్కులకు నిర్వహించగా, శ్రీనిధికి 935 మార్కులొచ్చాయి. 921 మార్కులతో ఉప్పుల సుప్రియ రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంక్, 915 మార్కులతో ఎస్.కవిత మూడో ర్యాంక్ సాధించారు. ఇవి ప్రాథమిక ర్యాంకులేనని, ఇందులో నుంచి ఎవరైనా నేషనల్ కోటాలో సీటు తీసుకుంటే స్టేట్ లెవల్ ర్యాంకులు మారతాయని అధికారులు వెల్లడించారు. మొత్తంగా తెలంగాణ నుంచి 8,649 మంది నీట్ పరీక్ష రాయగా, 4,933 మంది అర్హత సాధించారు. ఈ నెల రెండు లేదా మూడో వారంలో కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు కాళోజీ వర్సిటీ అధికారులు తెలిపారు.

టాప్ టెన్ ర్యాంకర్ల వివరాలు

రాష్ట్ర ర్యాంక్/విద్యార్థి పేరు

మార్కులు

నేషనల్ లెవల్ ర్యాంక్

1. ఎన్.శ్రీనిధి

935

49

2. సుప్రియ

921

96

3. ఎస్.కవిత

915

124

4. ఎస్.ఎస్.అక్షర

915

126

5. టి.సి.నాగసాయి

912

140

6. లక్ష్మీప్రసన్న

900

208

7. సాయి సుబ్రహ్మణ్యం

898

218

8. వి.నవ్య

897

237

9. నాయిని అభిలాష్

894

264

10. పి.భార్గవి

892

274

Published date : 07 Mar 2020 03:37PM

Photo Stories