Skip to main content

పీజీ మెడికల్ ఎగ్జామ్స్‌లో హైటెక్ మాస్ కాపీయింగ్.. ఎక్కడంటే!

ఎంజీఎం: వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కళాశాల (కేఎంసీ)లో మెడికల్ పీజీ పరీక్షల సందర్భంగా హైటెక్ మాస్ కాపీయింగ్ జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలకు చెందిన విద్యార్థులకు కేఎంసీలో సప్లమెంటరీ పీజీ పరీక్షలు 15 రోజులుగా నిర్వహిస్తుండగా రెండ్రోజుల క్రితమే ముగిశాయి. అయితే, కరీంనగర్‌లోని ప్రతిమ మెడికల్ కళాశాలకు చెందిన పీజీ విద్యార్థి ఒకరు హైటెక్ విధానంలో కాపీయింగ్ చేస్తూ పట్టుబడగా పరిపాలనాధికారులు యూనివర్సిటీకి వివరాలు అందజేసిన విషయం సోమవారం వెలుగులోకి వచ్చింది.
దరున్నారో తేలాలి
..
కేఎంసీలో జరిగిన మాస్ కాపీయింగ్ వెనుక కొందరు ఉద్యోగుల హస్తమున్నట్లు తెలుస్తోంది. పరీక్ష నిర్వహణ కోసం ప్రశ్నపత్రాన్ని ఓ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి డౌన్‌లోడ్ చేసి తనను ఆశ్రయించిన కొందరు వైద్య విద్యార్థులకు చేరవేసినట్లు సమాచారం. తద్వారా ఆ ప్రశ్నల జవాబును విద్యార్థి మైక్ రిసీవర్, వైర్‌లైస్ ఫోన్ ద్వారా తెలుసుకుని కాపీయింగ్ పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ తతంగానికి సహకరించినందుకు వైద్య విద్యార్థులు కొందరు ఉద్యోగులకు రూ.లక్షల్లో చెల్లించినట్లు సమాచారం. ఈక్రమంలో రెగ్యులర్ ఉద్యోగులను కాకుండా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పటివరకు ఒక విద్యార్థే మాస్ కాపీయింగ్‌కు పాల్పడినట్లు తేలినా కేఎంసీలోని సీసీ కెమెరాల పుటేజీని పరిశీలిస్తే ఇంకా ఎందరున్నారనేది తెలుస్తుందని చెబుతున్నారు.

కాపీ ఇలా..
కేఎంసీలో 15 రోజుల పాటు పరీక్షలు జరగ్గా చివరి రోజు మాత్రమే వైద్య విద్యార్థి పట్టుబడటం అనుమానాలకు తావిస్తోంది. పరీక్షకు హాజరైన విద్యార్థి ఓ కారు తీసుకొచ్చి పరీక్ష గది వెనుక ఉంచారు. ఆ కారు డ్రైవర్‌గా సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వ్యక్తిని ఎంచుకుని కారుకు యాంటీనా బిగించారు. అక్కడి నుంచి విద్యార్థి మోకాళ్లలో రిసీవర్ ఉంచుకుని వైర్‌లేస్ ఫోన్ ద్వారా జవాబులు తెలుసుకుంటూ రాసినట్లు సమాచారం. అయితే, చివరి రోజు అనుమానాస్పదంగా ఉన్న కారును గుర్తించిన పరిపాలనాధికారులు ఆరా తీస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

యూనివర్సిటీకి వివరాలిచ్చాం..
ఇటీవల నిర్వహించిన మెడికల్ పీజీ సప్లిమెంటరీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన విద్యార్థిని గుర్తించాం. చాలా తెలివిగా కరోనా నిబంధనలను సాకుగా చేసుకుని హైటెక్ మాస్ కాపీయింగ్‌కు పాల్పడ్డాడు. మోకాళ్ల వద్ద వైర్‌లెస్ రిసీవర్ ఉంచుకుని జవాబులు తెలుసుకున్నాడు. ప్రతిమ కళాశాలకు చెందిన ఆ విద్యార్థి వివరాలను కాళోజీ హెల్త్ యూనివర్సిటీకి అప్పగించాం. తదుపరి చర్యలు యూనివర్సిటీ అధికారులు తీసుకుంటారు.
- డాక్టర్ సంధ్య, కేఎంసీ ప్రిన్సిపాల్
Published date : 08 Dec 2020 04:23PM

Photo Stories