పీజీ మెడికల్, డెంటల్ కన్వీనర్ కోటా సీట్ల ప్రవేశాలకు నోటిఫికేషన్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: మెడికల్, డెంటల్ పీజీ కన్వీనర్ కోటా సీట్ల ప్రవేశాలకు కాళోజీ నారాయణరావు వైద్య, ఆరోగ్య విశ్వవిద్యాలయం ఏప్రిల్ 17న నోటిఫికేషన్ విడుదల చేసింది.
నీట్‌లో అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 18 నుంచి 25 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని వర్సిటీ తెలిపింది. అభ్యర్థులు నిర్దేశిత దరఖాస్తు పూర్తి చేయడంతోపాటు సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్ చేసి వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేయాలని పేర్కొంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వడం ఉండదని వర్సిటీ స్పష్టం చేసింది. ఆన్‌లైన్‌లో సమర్పించిన దరఖాస్తులు, సర్టిఫికెట్లను వర్సిటీ పరిశీలించిన అనంతరం తుది మెరిట్ జాబితా విడుదల చేస్తామని తెలిపింది. వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్ www.knruhs.telangana.gov.in ను సంప్రదించాలని సూచించింది.
Published date : 18 Apr 2020 03:38PM