Skip to main content

ఓయూ హెల్త్‌కేర్ కోర్సుల నోటిఫికేషన్

హైదరాబాద్: ఓయూ హెల్త్‌కేర్ కోర్సుల నోటిఫికేషన్ విడుదలైంది.
జంట నగరాల్లోని వివిధ ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో కొనసాగుతున్న పీజీ డిప్లొమా ఇన్ హెల్త్‌కేర్ కోర్సులో ప్రవేశానికి ఈ నెల 6 నుంచి 28 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సీపీజీఈటీ కన్వీనర్ ప్రొ. కిషన్ శుక్రవారం తెలిపారు. బీఎస్సీ, బీకాం, బీఏ డిగ్రీ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు 14 రకాల హెల్త్‌కేర్ కోర్సుల్లో ప్రవేశానికి అర్హులన్నారు. పూర్తి వివరాలను ఈ నెల 6 నుంచి ఉస్మానియా వెబ్‌సైట్‌లో చూడవచ్చని పేర్కొన్నారు.
Published date : 04 Jan 2020 01:01PM

Photo Stories