Skip to main content

నూతన మెడికల్‌ కాలేజీలకు రూ.5,800 కోట్లు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా నిర్మించే 12 మెడికల్‌ కాలేజీలకు రూ.5,800 కోట్లకు పరిపాలన అనుమతులిచ్చారు.
ఈ మేరకు వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం ఆరు ప్యాకేజీలుగా పనులు విభజించి ప్యాకేజీల వారీగా నిధులకు అనుమతించారు. ఇదివరకే పాడేరు, పులివెందుల, పిడుగురాళ్ల, మచిలీపట్నం కాలేజీలకు నిధులకు అనుమతిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా విజయనగరం, అనకాపల్లి, అమలాపురం, రాజమండ్రి, పాలకొల్లు, ఏలూరు, బాపట్ల, మార్కాపురం, మదనపల్లె, పెనుకొండ, నంద్యాల, ఆదోనిలున్నాయి.
Published date : 23 Mar 2021 03:10PM

Photo Stories