Skip to main content

నీట్‌ పీజీ–2021 వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి ఉధృతంగా మారిన నేపథ్యంలో ఏప్రిల్‌ 18న జరగాల్సిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్‌) పీజీ–2021ను కేంద్రం వాయిదా వేసింది.
నీట్‌ పీజీ–2021 సిలబస్, స్టడీ మెటీరియల్, ప్రిపరేషన్‌ గైడెన్స్, ప్రీవియస్‌ పేపర్స్, బిట్‌బ్యాంక్స్, మాక్‌ టెస్ట్స్, కట్‌ ఆఫ్‌ ర్యాంక్స్‌... ఇతర తాజా అప్‌డేట్స్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్దన్‌ గురువారం ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించిన తదుపరి తేదీని కొన్ని రోజుల తర్వాత అప్పటి పరిస్థితిని బట్టి ప్రకటిస్తామన్నారు. నీట్‌ పీజీ పరీక్షకు దేశవ్యాప్తంగా 1.75 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఈ పరీక్షను వాయిదా వేయాలని పలు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని కోరాయి. నీట్‌ పీజీకి సంబంధించిన అడ్మిట్‌ కార్డులు ఇప్పటికే విడుదలయ్యాయి.
Published date : 16 Apr 2021 04:41PM

Photo Stories