నేటి నుంచి తెలంగాణలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లోప్రవేశాలు షురూ!
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం అయింది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తుల నమోదుకోసం కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా యూనివర్సిటీ పరిధిలోని మెడికల్ కళాశాలల్లో సీట్లను భర్తీ చేయనున్నారు. జాతీయస్థాయి అర్హత పరీక్ష (నీట్ )-2020లో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తులు నమోదు చేసుకోవాలని నోటిఫికేషన్‌లో తెలిపారు. నవంబర్ 1వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 8వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు ఆ నోటిఫికేషన్‌లో సూచించారు. నిర్దేశిత దరఖాస్తును పూర్తి చేయడంతోపాటు అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్ చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో సమర్పించిన దరఖాస్తులు, సర్టిఫికెట్లను యూనివర్సిటీ పరిశీలించిన అనంతరం తుది మెరిట్ జాబితాను విడుదల చేస్తారు. ప్రవేశాలకు సంబంధించి అర్హత, ఇతర సమాచారానికి యూనివర్సిటీ వెబ్‌సైట్ http://www.knruhs.telangana.gov.in సంప్రదించాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.
Published date : 02 Nov 2020 04:37PM