నేటి నుంచి పీజీ మెడికల్ ప్రవేశ ప్రక్రియ ప్రారంభం
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత కోటాలో పీజీ మెడికల్ ప్రవేశ ప్రక్రియ ఏఫ్రిల్ 10 నుంచి ప్రారంభం కానుంది.
ఇప్పటికే దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ పూర్తి కాగా, కాలేజీల సీట్ల కేటాయింపు వివరాలను ఆన్‌లైన్ లో ఏఫ్రిల్ 10 న విడుదల చేస్తామని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ఏఫ్రిల్ 9 న ఒక ప్రకటనలో తెలిపింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఉన్న పీజీ సీట్లలో 50 శాతాన్ని అశిల భారత కోటా పరిధిలోకి స్వీకరించారు. ఇందులో అన్ని రాష్ట్రాల విద్యార్ధులకూ నీట్ ర్యాంకుల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. కరోనా నేపథ్యంలో ఇప్పటికే ప్రక్రియ ఆలస్యమైంది. తాజా ప్రకటన ప్రకారం తొలివిడత కేటాయింపు జాబితాను 10న విడుదల చేస్తారు. కేటాయించిన కోర్సు, కాలేజీల్లో విద్యార్ధులు చేరడానికి ఈ నెల 20 వరకూ గడువు విధించారు. విద్యార్ధులు వారికి కేటాయించిన కాలేజీకి నేరుగా వెళ్లి చేరిపోవచ్చు. కరోనా కారణంగా వెళ్లడానికి వీలుపడకపోతే ఆన్ లైన్ ద్వారా ప్రవేశ ప్రక్రియలో చేరవచ్చు.
Published date : 10 Apr 2020 04:38PM