మొత్తం సీట్లు 3675: నీట్ మాప్ అప్ రౌండ్ ప్రారంభం.. షెడ్యూల్ ఇదే
Sakshi Education
సాక్షి, ఎడ్యుకేషన్: ఎంబీబీఎస్/బీడీఎస్-యూజీ కోర్సుల్లో నీట్ ద్వారా ప్రవేశ ప్రక్రియలో భాగంగా మాప్ అప్ రౌండ్ కౌన్సిలింగ్‌కు ది మెడికల్ కౌన్సిల్ కమిటీ (ఎంసీసీ) ప్రకటన విడుదల చేసింది.
అర్హులైన అభ్యర్థు లు ఈనెల 14వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తు చేసు కోవచ్చు. వివిధ కోటాల కింద మొత్తం 3675 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎయిమ్స్ సీట్లు, జిప్‌మర్ ఓపెన్, బీహెచ్ యూ ఓపెన్, ఎన్‌ఆర్‌ఐ, జామియా ఓపెన్, ఏఎమ్ యూ ఓపెన్, జిప్ మర్ ఎన్‌ఆర్‌ఐ, జిప్‌మర్ ఇంటర్నే షనల్, ఈఎస్‌ఐ, ఐపీ యూనివర్సిటీ, డియూ ఇంటర్నల్, సీడబ్ల్యు, మేనేజ్‌మెంట్ అండ్ పెయిడ్ సీట్లు, ఏఎమ్‌యూ ఇంటర్నల్, ఏఎమ్ యూ ఎన్‌ఆర్‌ఐ, అలాగే జైన్ మైనారిటీ వైద్యసంస్థల్లోనూ ఖాళీ సీట్లను నీట్ ర్యాంకుల ప్రాతిపదికనే భర్తీ చేస్తున్నారు.
ముఖ్యమైన సమాచారం :
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
రిజిస్ట్రేషన్ చివరి తేదీ : డిసెంబర్ 14, 2020 మధ్యాహ్నం 3 గంటల వరకు
పేమెంట్ చివరి తేదీ : డిసెంబర్ 11వ తేదీ నుంచి 14వ తేదీ, 2020 సాయంత్రం 7 గంటల వరకు
ఛాయిస్ ఫిల్లింగ్/లాకింగ్ : డిసెంబర్ 14 అర్థరాత్రి వరకు
సీట్ అలాట్‌మెంట్ : డిసెంబర్ 15, 16 తేదీల్లో
ఫలితాలు : డిసెంబర్ 17, 2020
రిపోర్టింగ్ : 2020 డిసెంబర్ 18-26 తేదీ వరకు
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://mcc.nic.in/UGCounselling/

Published date : 12 Dec 2020 03:36PM