మెడికల్ రిజిస్ట్రేషన్ల ఫీజు సగానికి తగ్గింపు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ బుధవారం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.
కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ రవీందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నమోదు రుసుమును తగ్గిస్తూ నిర్ణయించారు. ఎంబీబీఎస్, పీజీ, సూపర్ స్పెషాలిటీ తదితర వైద్య విద్య అర్హతకు సంబంధించి కొత్తగా నమోదు, పునరుద్ధరణ సందర్భంలోనూ చెల్లించాల్సిన రుసుముల్లో దాదాపు 50 శాతం వరకూ తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా 65 ఏళ్లు దాటిన వైద్యులు ఎటువంటి రుసుములు చెల్లించనక్కర్లేదని తీర్మానించింది. 65 ఏళ్లు దాటిన వృద్ధులు ప్రాక్టీస్ కొనసాగించాలంటే నమోదు చేసుకోవాల్సిందే గానీ రుసుము మాత్రం కట్టక్కర్లేదని, దేశంలోనే ఇది నూతన విధానమని డాక్టర్ రవీందర్ రెడ్డి తెలిపారు.
Published date : 03 Dec 2020 05:20PM