Skip to main content

మెడికల్ రీసెర్చ్ కార్పొరేషన్‌కు ప్రత్యేక బోర్డు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కార్పొరేషన్ (ఏపీఎంఈఆర్‌సీ)కు 8 మంది సభ్యులతో ప్రత్యేక బోర్డ్‌ను ఏర్పాటు చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ మంగళవారం ఉత్తర్వులిచ్చారు.
ఈ బోర్డుకు చైర్మన్‌గా ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి వ్యవహరిస్తారు. కన్వీనర్‌గా డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) ఉంటారు. సభ్యులుగా ఏపీఎంఈఆర్‌సీ వైస్ చైర్మన్, ఆర్థిక శాఖ కార్యదర్శి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్, ఆరోగ్యశ్రీ సీఈవో, ఏపీఎంఎస్‌ఐడీసీ ఎండీ, వైద్య విధాన పరిషత్ కమిషనర్‌లు ఉంటారు. కొత్త కాలేజీల నిర్మాణాలు, పాత కాలేజీల్లో ‘నాడు-నేడు’ పనుల నిర్వహణ, నర్సింగ్ కాలేజీల నిర్మాణాలు, వాటి నిర్వహణ, నిధుల సేకరణ వంటి పనులు ఈ బోర్డు సభ్యుల ఆధ్వర్యంలోనే జరుగుతాయి.
Published date : 03 Feb 2021 05:37PM

Photo Stories