మార్చి 31 వరకు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ బంద్
Sakshi Education
విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న కోవిడ్-19 నివారణ చర్యల్లో భాగంగా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఈనెల 31వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు.
అన్ని విభాగాల కార్యకలాపాలు రద్దు చేశామని యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ కె.శంకర్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర పరిస్థితిలో ఉద్యోగులు ఎప్పుడంటే అప్పుడు యూనివర్సిటీకి అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీలోని ఏపీ మెడికల్ కౌన్సిల్‌కు సెలవులు ప్రకటించే విషయంలో శుక్రవారం వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. విదేశాల్లో ఎంబీబీఎస్ చదివిన విద్యార్థులు రిజిస్ట్రేషన్, సమాచారం కోసం వస్తుండడంతో మెడికల్ కౌన్సిల్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Published date : 21 Mar 2020 03:02PM