ఈ ఏడాది తెలంగాణకు మొత్తం 4,915 ఎంబీబీఎస్ సీట్లు: కాళోజీ ఆరోగ్య విశ్వ విద్యాలయం
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్, మైనారిటీ కాలేజీల్లో మొత్తం 4,915 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది.
10 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 1,715 సీట్లు ఉండగా, 22 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, మైనారిటీ కాలేజీల్లో 3,200 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయని విశ్వవిద్యాలయం ప్రకటించింది. శుక్రవారం ‘నీట్’ఫలితాలు వెలువడ్డ నేపథ్యంలో రాష్ట్రంలో సీట్లపై స్పష్టత వచ్చింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నుంచి నీట్‌లో అర్హత సాధించిన రాష్ట్రానికి చెందిన అభ్యర్థుల వివరాల డేటా రాగానే అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ చేస్తామని వర్సిటీ వెల్లడించింది.
15 శాతం సీట్లు ఆలిండియా కోటాకు కేటాయింపు..
రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 2020-21 వైద్య విద్యా సంవత్సరానికి మొత్తంగా 4,915 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వంలోని అన్ని సీట్లు, ప్రైవేటు కాలేజీల్లోని 50 శాతం సీట్లు కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని సీట్లలో 15 శాతం ఆలిండియా కోటా కింద భర్తీ చేస్తారు. వాటిల్లో రెండు విడతల కౌన్సెలింగ్ తర్వాత సీట్లు మిగిలితే తిరిగి వాటిని మనకే ఇస్తారు. మరోవైపు ఆర్థికంగా బలహీన వర్గాల (ఈడబ్ల్యూఎస్)కు 10 శాతం రిజర్వేషన్ మేరకు సీట్ల కేటాయింపు జరిగింది.

Published date : 17 Oct 2020 02:49PM