ఈ ఏడాది మొత్తం ప్రభుత్వ, కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ సీట్లు 3,662
ప్రభుత్వ పరిధిలో (ఆల్ ఇండియా కోటాతో కలిపి) 3,662 సీట్లు ఉన్నాయి. వీటికోసం అభ్యర్థులు తీవ్రస్థాయిలో పోటీ పడుతున్నారు. రాష్ట్ర ర్యాంకులనుబట్టి చూస్తే 32 వేలమందికిపైనే ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది మార్కులు ఎక్కువగా వచ్చినందున గత ఏడాది కటాఫ్‌లతో బేరీజు వేయలేమని, అందువల్ల సీటు ఎక్కడొస్తుందనేని అంచనా వేయలేమని అభ్యర్థులు పేర్కొంటున్నారు. వీరు వరుసగా విశాఖపట్నంలోని ఆంధ్రా మెడికల్ కాలేజీ, గుంటూరు వైద్యకళాశాల, కర్నూలు, తిరుపతి, కాకినాడ కాలేజీలను తమ ప్రాధాన్యతలుగా చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నాడు-నేడు కింద అన్ని ప్రభుత్వ వైద్యకళాశాలల్లోనూ మౌలిక వసతులు కల్పించడం, అధ్యాపకులను నియమించడంతో మిగతా కాలేజీల్లో సీటు వచ్చినా బావుంటుందని పేర్కొంటున్నారు. త్వరలోనే ఆన్‌లైన్ పరిశీలనకు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు.
వివిధ కేటగిరీల్లో సీట్లు..
కేటగిరీ | సీట్లు |
ప్రభుత్వ సీట్లు (ఆలిండియా కోటాతో కలిపి) | 2,185 |
ప్రైవేటులో కన్వీనర్ కోటా (మైనార్టీతో కలిపి) | 1,325 |
స్విమ్స్ తిరుపతి | 152 |
ప్రైవేటు కాలేజీల్లో బీ కేటగిరీ | 921 |
ప్రైవేటు కాలేజీల్లో సీ కేటగిరీ (ప్రవాస భారతీయ) | 427 |
స్విమ్స్‌లో సీ కేటగిరీ | 23 |
ప్రభుత్వ దంతవైద్య సీటు | 140 |
ప్రైవేటు డెంటల్ కాలేజీల్లో కన్వీనర్ కోటా | 650 |
ప్రైవేటులో బీ కేటగిరీ దంతవైద్య సీట్లు | 454 |
ప్రైవేటులో సీ కేటగిరీ దంతవైద్య సీట్లు | 196 |