Skip to main content

గత 27 నెలల్లో.. ఆరోగ్య శాఖలో 14 వేల పోస్టులు భర్తీ..!

గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వాసుపత్రికి రావాలంటేనే రోగులు భయపడే పరిస్థితి. వైద్యుల కొరతతో రోగులకు సకాలంలో సరైన చికిత్స అందేది కాదు.
నర్సులు నియామకాలు లేక సేవలు అరకొరగానే ఉండేవి. మందులుండేవి కావు. నిర్ధారణ పరీక్షలు జరిగేవి కావు. వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక వైద్య ఆరోగ్యశాఖపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ప్రజలకు సరైన వైద్యం అందడానికి ఆస్పత్రుల్లో ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించింది. గత ప్రభుత్వం ఐదేళ్లలో 1,500 పోస్టులు కూడా భర్తీ చేయలేని పరిస్థితి. ఈ ప్రభుత్వం అధికారం చేపట్టిన 27 మాసాల్లోనే ఆరోగ్య శాఖలో సువూరు 14 వేల పోస్టులను భర్తీ చేసింది. రాష్ట్ర చరిత్రలోనే ఆ శాఖలో ఇది అతిపెద్ద నియామక ప్రక్రియ అని అధికారులు చెబుతున్నారు.

చ‌ద‌వండి: వైజాగ్‌ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ– 2021 వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..

చ‌ద‌వండి: ఆగస్టు 16 నుంచి ఇంటర్‌ సెకండియర్‌ తలగతులు ప్రారంభం..

చ‌ద‌వండి: వర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి పీహెచ్‌డీ తప్పనిసరి.. 50 వేల మంది ఆశలు గల్లంతు..

వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరిస్థితులు మెరుగవుతున్నాయి. వైద్యుల కొరత లేకుండా భర్తీ ప్రక్రియ చేపట్టారు. ఒక్క బోధనాసుపత్రుల్లోనే 622 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు భర్తీ చేశారు. అంతేకాదు ఒక్కో ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి ఇద్దరు వైద్యులు ఉండాలనే లక్ష్యంతో 645 మంది ఎంబీబీఎస్‌ వైద్యులను శాశ్వత ప్రాతిపదికన నియమించారు. వైద్యవిధానపరిషత్‌ పరిధిలోని సామాజిక ఆరోగ్యకేంద్రాలు, ఏరియా ఆస్పత్రులకు 232 మంది సివిల్‌ అసిస్టెంట్‌ çసర్జన్‌లను నియమించారు. 1,499 మంది వైద్యులను ప్రభుత్వ పరిధిలో నియమించారు. గత ప్రభుత్వ హయాంలో ఆయుష్‌ డిస్పెన్సరీల్లో పనిచేసే సుమారు 800 మంది ఉద్యోగులను తొలగించారు. అప్పట్లో జాతీయ ఆరోగ్యమిషన్‌ ఆయుష్‌ వైద్యుల నియామకానికి అనుమతించినా రాష్ట్ర సర్కారు చొరవ చూపకపోవడంతో కొత్త ఉద్యోగాల భర్తీ ఊసే లేకపోయింది.

మెరుగుపడిన నర్సింగ్‌ సేవలు
గతంలో నర్సులు లేక, సేవలు అందక రోగులు ఇబ్బంది పడేవారు. ప్రస్తుత ప్రభుత్వం 4,683 మంది నర్సులను నియమించింది. ఇవి కాకుండా ఇప్పటివరకూ వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లలో 1,818 మంది బీఎస్సీ నర్సింగ్‌ చదివిన వారిని మిడ్‌లెవెల్‌ హెల్త్‌ప్రొవైడర్లుగా నియమించారు. ఒక్కసారిగా భారీ సంఖ్యలో నర్సింగ్‌ నియామకాలు జరగడంతో బోధనాసుపత్రుల నుంచి పీహెచ్‌సీల వరకూ సేవల్లో గణనీయ మార్పులు వచ్చాయి. 21 మంది ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లను ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నియమించింది.

వివిధ విభాగాల్లో 2019 జూన్‌ నుంచి నియామకాలు ఇలా..

విభాగం

నియామకాలు

డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌

2,873

డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌

4,888

జాతీయ ఆరోగ్యమిషన్‌

4,373

ఏపీఎంఎస్‌ఐడీసీ

38

వైద్యవిధాన పరిషత్‌

1,770

ఔషధ నియంత్రణ శాఖ

11

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌

23

ఆయుష్‌

09

అరోమాటిక్‌ ప్లాంట్స్‌ బోర్డ్‌

02


కొత్తగా విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం 2021 నవంబర్‌లో నియామకాలు ఇలా..

డాక్టర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు

451

పారామెడికల్, ఫార్మసిస్ట్, ల్యాబ్‌టెక్నీషియన్లు

5,251

నర్సులు

441


త్వరలో పీహెచ్‌సీలకు నియామకాలు
రాష్ట్రంలో ప్రస్తుతం 1,149 పీహెచ్‌సీలు ఉన్నాయి. కొత్తగా 176 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. కొత్తగా వచ్చే పీహెచ్‌సీలకు వైద్యులు, పారామెడికల్, నర్సింగ్‌ సిబ్బంది నియామకాన్ని త్వరలోనే చేపడతాం. ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులు ఉండేలా చర్యలు తీసుకుంటాం.
– డా.గీతాప్రసాదిని, ప్రజారోగ్య సంచాలకులు
Published date : 11 Aug 2021 01:46PM

Photo Stories