ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో 3089 పోస్టుల భరీక్తి నోటిఫికేషన్
Sakshi Education
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నియామకాలకు అనుమతి ఇచ్చింది.
వైద్య ఆరోగ్యశాఖలోని వివిధ ఆస్పత్రుల్లో ఏడాది పాటు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసేందుకు ఉత్తర్వులు జారీచేసింది. జిల్లాల వారీగా స్టాఫ్‌నర్సులు, ఎంఎన్‌ఓ (మేల్ నర్సింగ్ ఆర్డర్లీ), ఎఫ్‌ఎన్‌ఓ (ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ), స్వీపర్లు, అనస్థీషియా టెక్నీషియన్లు మొత్తం కలిపి 3089 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్ట్‌లను జిల్లాల వారీగా భర్తీ చేసేందుకు కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్.. జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.
ఖాళీల సంఖ్య ఇలా..
ఖాళీల సంఖ్య ఇలా..
- వైద్యవిధాన పరిషత్‌లో స్టాఫ్‌నర్సులు 298, ఎంఎన్‌ఓ/ఎఫ్‌ఎన్‌ఓ 400, స్వీపర్లు 329
- ప్రజారోగ్యశాఖలో స్టాఫ్‌నర్సులు 271, ఎంఎన్‌ఓలు 176, ఎఫ్‌ఎన్‌ఓలు 131, స్వీపర్లు 102
- వైద్యవిద్యా శాఖలో స్టాఫ్‌నర్సులు 443, ఎఫ్‌ఎన్‌ఓలు 150, ఎంఓన్‌ఓలు 213, అనస్థీషియా టెక్నీషియన్లు 306, స్వీపర్లు 270
Published date : 16 Apr 2020 06:45PM