డిసెంబర్ 1 నుంచి మెడికల్ కాలేజీలు తెరవండి: ఆరోగ్య శాఖ
Sakshi Education
న్యూఢిల్లీ: కోవిడ్ నేపథ్యంలో గత మార్చిలో మూతబడిన మెడికల్ కాలేజీలు అన్నింటినీ డిసెంబర్ 1 నుంచి తిరిగి తెరవాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది.
ఈ మేరకు బుధవారం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యకార్యదర్శులు, పాలనాధికారులకు లేఖలు పంపింది. కాలేజీలను తెరిచేందుకు ఆరోగ్య శాఖ.. కేంద్ర హోంశాఖ నుంచి అనుమతులు కూడా పొందింది. కోవిడ్ 19 నిబంధనలైన భౌతిక దూరం, మాస్కులు ధరించడం, శానిటైజర్ వాడటం తప్పనిసరి అని పేర్కొంది. 2021-22కి సంబంధించిన పీజీ-నీట్ పరీక్ష, అభ్యర్థుల శిక్షణ పూర్తికాని కారణంగా ఆలస్యమైందని చెప్పింది. ఈ శిక్షణ 2021 ఫిబ్రవరి నుంచి పూర్తి స్థాయిలో ప్రారంభం అవుతుందని తెలిపింది.
Published date : 26 Nov 2020 02:18PM