‘ఆయుష్ మెడికల్’ సీట్ల భర్తీకి నోటిఫికేషన్: కాళోజీ వర్సిటీ
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ, ప్రైవేట్ ఆయుష్ కళాశాలల్లో కన్వీనర్ కోటాలో బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీయూఎంఎస్, బీఎన్వైసీ కోర్సుల్లో ప్రవేశాలకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది.
నీట్ 2020లో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ నెల 13వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 20వ తేదీ రాత్రి 8 గంటల వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపింది. దరఖాస్తు పూర్తి చేయడంతో పాటు సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలని పేర్కొంది. వివరాలకు www.knruhs.telangana.gov.in ను సంప్రదించాలని సూచించింది.
Published date : 13 Jan 2021 01:34PM