9 వైద్య కళాశాలల్లో కొత్త విభాగాలు.. పీజీ వైద్య సీట్లు పెరిగే అవకాశం
Sakshi Education
సాక్షి, అమరావతి: పెరుగుతున్న వైద్య అవసరాలు, కొత్తరకం జబ్బులను ఎదుర్కోవడానికి బోధనాస్పత్రులను మరింత బలోపేతం చేయాలని ఆంధ్రప్రదేశ్ సర్కార్ భావిస్తోంది.

ఈ నేపథ్యంలో ఇప్పటివరకు లేని కొత్త విభాగాలను వాటిలో ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య విద్యా శాఖ నిర్ణయించింది. 11 ప్రభుత్వ వైద్య కళాశాలలుండగా ఇందులో 9 బోధనాస్పత్రుల్లో అవసరాన్ని బట్టి కొత్త విభాగాలు, కొన్ని చోట్ల ఉన్న విభాగాల్లోనే అదనపు యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. కొత్త విభాగాలు ఏర్పాటు చేయడం వల్ల భవిష్యత్లో పీజీ వైద్య సీట్లు కూడా పెరగనున్నాయి.
వైద్య కళాశాలలు - విభాగాలు..
వైద్య కళాశాలలు - విభాగాలు..
- గుంటూరు మెడికల్ కాలేజ్: ట్రాన్స్ ఫ్యూజన్ మెడిసిన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, ఎమర్జెన్సీ మెడిసిన్, నియోనెటాలజీ, సర్జికల్ అంకాలజీ, మెడికల్ అంకాలజీ, న్యూరో సర్జరీ (అదనపు యూనిట్), యూరాలజీ (అదనపు యూనిట్)
- కర్నూలు మెడికల్ కాలేజ్: ట్రాన్స్ ఫ్యూజన్ మెడిసిన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, నియోనెటాలజీ, పీడియాట్రిక్ సర్జరీ, న్యూరో సర్జరీ (అదనపు యూనిట్), యూరాలజీ (అదనపు యూనిట్)
- ఎస్వీఎంసీ, తిరుపతి: ట్రాన్స్ ఫ్యూజన్ మెడిసిన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, ఎమర్జెన్సీ మెడిసిన్, నియోనెటాలజీ
- ఆంధ్రా మెడికల్ కాలేజ్, విశాఖపట్నం: ట్రాన్స్ ఫ్యూజన్ మెడిసిన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, నియోనెటాలజీ, సర్జికల్ అంకాలజీ, మెడికల్ అంకాలజీ, న్యూరో సర్జరీ (అదనపు యూనిట్), యూరాలజీ (అదనపు యూనిట్), కార్డియాలజీ (అదనపు యూనిట్)
- ప్రభుత్వ మెడికల్ కాలేజ్, అనంతపురం: పీడియాట్రిక్ సర్జరీ
- రంగరాయ మెడికల్ కాలేజ్, కాకినాడ: ట్రాన్స్ ఫ్యూజన్ మెడిసిన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, ఎమర్జెన్సీ మెడిసిన్, నియోనెటాలజీ, న్యూరో సర్జరీ (అదనపు యూనిట్)
- ప్రభుత్వ మెడికల్ కాలేజ్, కడప: ట్రాన్స్ ఫ్యూజన్ మెడిసిన్, నియోనెటాలజీ
- ప్రభుత్వ మెడికల్ కాలేజ్, శ్రీకాకుళం: ట్రాన్స్ ఫ్యూజన్ మెడిసిన్
- ప్రభుత్వ మెడికల్ కాలేజ్, ఒంగోలు: ట్రాన్స్ ఫ్యూజన్ మెడిసిన్, కార్డియాలజీ, గ్యాో్ట్ర ఎంటరాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, నెఫ్రాలజీ, యూరాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ.
Published date : 18 May 2020 03:37PM