2020- 23 బీఎస్సీ, పారామెడికల్ ఫీజుల నిర్ధారణ
Sakshi Education
సాక్షి, అమరావతి: ప్రైవేట్, అన్ ఎయిడెడ్, మైనార్టీ కళాశాలల్లో బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బేసిక్ నర్సింగ్, బీపీటీ, ఎంపీటీ, పారామెడికల్ కోర్సులకు ఫీజుల నిర్ధారణ చేశారు.
ఏపీ ఉన్నత విద్యాశాఖ ఫీజుల నియంత్రణ కమిటీ సూచించిన ప్రకారం ఈ ఫీజుల నిర్ధారణ జరిగింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ బుధవారం ఉత్తర్వులిచ్చారు. బీఎస్సీ నర్సింగ్ కన్వీనర్ కోటా సీటుకు రూ.18వేలు, బీ.కేటగిరీ సీటుకు రూ.80 వేలు, ఎంఎస్‌సీ నర్సింగ్‌లో కన్వీనర్ కోటాకు రూ.83 వేలు, బీ కేటగిరీ (మేనేజ్‌మెంట్) సీటుకు రూ.1.49 లక్షలుగా నిర్ణయించారు. ఎంపీటీ కోర్సుకు కన్వీనర్ కోటా రూ.94 వేలు, బీ కేటగిరీ సీటుకు రూ.1.60 లక్షలుగా నిర్ణయించారు. ఈ ఫీజులు 2023 వరకు అమల్లో ఉంటాయి.
Published date : 24 Dec 2020 05:12PM