2017–20 కాలానికి వైద్య కోర్సుల ఫీజుల నిర్ణయం
Sakshi Education
సాక్షి, అమరావతి: ఇప్పటివరకు బ్లాక్ పిరియడ్‌లో ఉన్న 2017–18 నుంచి 2019–20 కాలానికి పీజీ మెడికల్, పీజీ డెంటల్ కాలేజీల వైద్య కోర్సుల ఫీజులను నిర్ధారిస్తూ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ గురువారం ఉత్తర్వులిచ్చింది.
ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ (ఏపీహెచ్‌ఈఆర్‌ఎంసీ) పరిశీలించి నిర్ధారించిన మేరకు కళాశాల గ్రేడింగ్ ఆధారంగా కన్వీనర్, మేనేజ్‌మెంట్, ఎన్‌ఆర్‌ఐ కోటాల ఫీజులను నిర్ణయిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో కొంతమంది విద్యార్థులు కళాశాల ఫీజులపై కోర్టుకు వెళ్లడంతో తీర్పు ఆధారంగా ఫీజులను నిర్ధారించారు.
Published date : 16 Apr 2021 04:29PM