1,070 మంది స్పెషలిస్టు వైద్యుల నియామకం
Sakshi Education
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని కోవిడ్ ఆస్పత్రుల్లో పనిచేసేందుకు స్పెషలిస్టు వైద్యుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నియామక నోటిఫికేషన్ జారీ చేసింది.
జనరల్ మెడిసిన్, పల్మనరీ మెడిసిన్, అనస్థీషియాలజీ వైద్యులు కావాలని ఇన్‌చార్జి వైద్యవిద్యా సంచాలకులు డా.జీవీ.రాంప్రసాద్ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. 1,070 పోస్టులు కాంట్రాక్టు పద్ధతిలో నియమిస్తున్నామన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మే 7వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు, ఇతర వివరాలకు http://dme.ap.nic.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలిపారు.
Published date : 30 Apr 2020 02:06PM