Skip to main content

100 ఎంబీబీఎస్‌ సీట్లకు రూ.182 కోట్ల వ్యయం

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న కొత్త మెడికల్‌ కాలేజీలకయ్యే వ్యయాన్ని వైద్య విద్యా శాఖ అంచనా వేసింది.
100 ఎంబీబీఎస్‌ సీట్లతో ఒక మెడికల్‌ కాలేజీ, దానికి అనుబంధంగా ఆస్పత్రి, స్పెషాలిటీ వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది ఇలా అవసరమైన వనరులు సమకూర్చుకునేందుకు ఏడాదికి రూ.182 కోట్ల వ్యయమవుతుందని తేల్చింది. ఇందులో మెజారిటీ వ్యయం టీచింగ్‌ సిబ్బంది, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది వేతనాలకే సరిపోతుంది. వీరికి దాదాపు రూ.160 కోట్ల వరకు ఖర్చువుతుంది. ఒక్కో మెడికల్‌ కాలేజీలో 32 స్పెషాలిటీలకు సంబంధించిన వైద్యులు అందుబాటులో ఉంటారు. ఇక నిర్మాణాలకైతే రూ.300 కోట్ల నుంచి రూ.450 కోట్ల వరకు వ్యయమయ్యే అవకాశముంది. అదే 150 ఎంబీబీఎస్‌ సీట్లకు తగినట్టుగా కాలేజీ ఏర్పాటు చేయాలంటే మరో 20 శాతం అదనంగా అవుతుందని నిపుణుల అంచనా. ఈ లెక్కన కొత్తగా ఏర్పాటు చేయనున్న 16 మెడికల్‌ కాలేజీలకు ఎంత ఖర్చవుతుందో అర్థం చేసుకోవచ్చని వారు పేర్కొన్నారు. ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న కొత్త కాలేజీలు అందుబాటులోకి వస్తే స్పెషాలిటీ సేవలు ఎక్కువ మందికి అందుబాటులోకి వస్తాయి.

తాజా అంచనా ప్రకారం ఏడాదికయ్యే వ్యయం(రూ.కోట్లలో)

కేటగిరీ

వ్యయం

టీచింగ్‌ సిబ్బంది వేతనాలు

72.06

నాన్‌ టీచింగ్‌ సిబ్బంది వేతనాలు

87.74

శానిటేషన్, సెక్యూరిటీ, పెస్ట్‌ కంట్రోల్‌

10.20

ఆక్సిజన్‌

0.12

డ్రగ్స్, కన్జ్యూమబుల్స్‌

11.00

రోగులకు ఆహారం

1.00

వాటర్, కరెంటు చార్జీలు

0.15

మొత్తం

182.27

Published date : 19 Apr 2021 03:07PM

Photo Stories