Medical Officer Jobs: ఏఎఫ్‌ఎంఎస్ లో 400 మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక!
Sakshi Education
కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ (AFMS) విభాగంలో మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం పోస్టులు: 400
- మెడికల్ ఆఫీసర్ (పురుషులు): 300
- మెడికల్ ఆఫీసర్ (మహిళలు): 100
అర్హతలు:
- అభ్యర్థులు జాతీయ వైద్య కమిషన్ చట్టం–2019 ప్రకారం గుర్తింపు పొందిన వైద్య అర్హత కలిగి ఉండాలి.
- ఏదైనా రాష్ట్ర వైద్య మండలి/ఎంసీఐ/ఎన్‌బీఈ/ఎన్‌ఎంసీ నుంచి శాశ్వత రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి.
- పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉన్నవారు కూడా అర్హులు.
గరిష్ఠ వయసు: 32 సంవత్సరాలు.
ఎంపిక విధానం: అభ్యర్థుల ఎంపిక ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది.
దరఖాస్తు విధానం: దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లోనే ఉంటుంది.
చివరి తేదీ: 12 మే 2025
అధికారిక వెబ్‌సైట్: https://join.afms.gov.in
>> AP Jobs: ఏపీ డీఎంఈలో 1183 సీనియర్ రెసిడెంట్ పోస్టులు.. నెలకు రూ.97,750 జీతం!
![]() ![]() |
![]() ![]() |
Published date : 24 Apr 2025 03:15PM