యువతకు ఉచితంగా నైపుణ్య శిక్షణ తోపాటు.. ఉద్యోగం కూడా!
Sakshi Education
సాక్షి,అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి (ఏపీఎస్‌ఎస్‌డీసీ) సంస్థ ఆధ్వర్యంలో ఎస్‌జీబీఎస్ ఉన్నతి ఫౌండేషన్ వారు నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారని ఏపీఎస్‌ఎస్‌డీసీ చైర్మన్ చల్లా మదుసూధన్‌రెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడుతూ.. 35 రోజుల పాటు బెంగుళూరులో ఈ శిక్షణ ఉంటుందని తెలిపారు. ఉచిత భోజన, వసతి సౌకర్యాలు ఉంటాయన్నారు. బిజినెస్ అసోసియేట్, ఫీల్డ్ సేల్స్, రిటైల్ అసోసియేట్, బ్యూటీషియన్, గెస్ట్ కేర్, టాలీతో పాటు ఉద్యోగ రీత్యా కావాల్సిన స్కిల్స్‌పై శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. మరిన్ని వివరాలకు 9963425999, 8688431813 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు.
Published date : 13 Jan 2021 01:30PM