వరంగల్ నిట్‌లో 471 మందికి ప్లేస్‌మెంట్స్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: వరంగల్ నిట్‌లో జరిగిన క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో 471 మందికి ఉద్యోగాలు లభించాయి.
ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి జనవరి 19వ తేదీ నాటికి వివిధ కంపెనీలు నిర్వహించిన ప్లేస్‌మెంట్స్‌లో ఎనిమిది బ్రాంచ్‌లకు చెందిన 857 మంది విద్యార్థులు హాజరు కాగా, వీరిలో 471 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఎంపికైన వారి సగటు వేతనం సంవత్సరానికి రూ.43.33 లక్షలు. ఎంపికైన వారిలో 122 మందికి ఏటా రూ.47లక్షల ప్యాకేజీ కాగా, 105 మంది రూ.45 లక్షల ప్యాకేజీ, 85 మంది రూ.43.30 లక్షల ప్యాకేజీకి ఎంపికయ్యారు.
Published date : 25 Jan 2020 02:47PM