విమెన్ ఇన్వెస్ట్‌మెంట్ ఇనీషియేటివ్‌లో దరఖాస్తులు ఆహ్వానం
Sakshi Education
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆర్థిక రంగంలో మహిళలకు ప్రోత్సాహాన్ని అందించే ‘విమెన్ ఇన్వెస్ట్‌మెంట్ ఇనీషియేటివ్-2020’ కార్యక్రమానికి చార్టెర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ (సీఎఫ్‌ఏ) ఔత్సాహిక మహిళ పారిశ్రామికవేత్తల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఆర్థిక క్రమశిక్షణ, పెట్టుబడులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వంటి అంశాలపై నాలుగు వారాల పాటు ఉచిత శిక్షణ ఉంటుందని సీఎఫ్‌ఏ సౌత్ ఈస్ట్ ఏషియా డెరైక్టర్ అమిత్ చక్రభర్తి సోమవారమిక్కడ విలేకరులకు తెలిపారు. ఎంపికై న అభ్యర్థులకు సీఎఫ్‌ఏలో సభ్యులైన 30 ఫైనాన్షియల్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలను కూడా కల్పిస్తామని పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు www.empowering youngwomen.cfa ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ మార్చి8.
Published date : 25 Feb 2020 01:52PM