Skip to main content

ఉద్యోగాలుంటాయా...?

లాక్‌డౌన్‌తో పరిశ్రమలు, వ్యాపారాలు మూతబడటంతో ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న లక్షల మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలు ఉంటాయో పోతాయోనని తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
ఇప్పటికే చాలా పరిశ్రమలు, వ్యాపార సంస్థలు తమ తాత్కాలిక ఉద్యోగులను పనిలో నుంచి తీసేశాయి. రెగ్యులర్ ఉద్యోగులకు సైతం చాలా పరిశ్రమలు, వ్యాపార సంస్థలు జీతాలు చెల్లించట్లేదు. 1,63,302 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో 9,80,520 మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. 2,493 భారీ పరిశ్రమల్లో మరో 9,65,050 మంది ఉద్యోగులున్నారు. లాక్‌డౌన్‌తో ఇవన్నీ మూతపడడంతో వీటిలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఐటీ కంపెనీలు, పరిశ్రమలు ఉద్యోగుల తొలగింపు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయని వార్తలు వస్తుండడంతో ఆయా ఉద్యోగుల్లోనూ ఆందోళన మరింత పెరిగిపోయింది.
Published date : 30 Apr 2020 02:08PM

Photo Stories