ఉద్యోగాలు వదులుకున్నవారికి బంపర్ ఆఫర్ ఇదే..
Sakshi Education
బెంగుళూరు: ఐటీ సర్వీసుల గ్లోబల్ దిగ్గజం యాక్సెంచర్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
కరోనా ఉదృతి నేపథ్యంలో ఐటీ కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్న విషయం తెలిసిందే. అయితే తమ సంస్థలో స్వచ్చందంగా ఉద్యోగాలు వదులుకునే వారికి 7 నెలల వేతనాలు చెల్లించాలని యాక్సెంచర్ భావిస్తోంది. ఇందులో ముడు నెలల కాలాన్ని నోటీస్ పిరియడ్గా పేర్కొనగా, మరో నాలుగు నెలలు వేతనాలను చెల్లించనుంది. అయితే మెజారిటీ ఐటీ కంపెనీలు ఉద్యోగాలు వదులుకున్న వారికి రెండు నుంచి మూడు నెలల మాత్రమే వేతానాలు చెల్లిస్తున్నాయి.
కాగా యాక్సెంచర్ సంస్థలో నైపుణ్యం లేని 5శాతం ఉద్యోగులకు కోత విధించనున్నట్లు గతంలో యాక్సెంచర్ ప్రకటించింది. అయితే సంస్థ మాత్రం ప్రతి సంవత్సరం కొత్త ఉద్యోగాలు, ఉద్యోగాల కోత సహజమేనని పేర్కొంది. అయితే ఎక్కువగా టెక్నాలజీకి డిమాండ్ లేని ప్రాంతాలలో ఉద్యోగాల కోత ప్రభావం ఎక్కువుంటుంది. మరోవైపు టెక్నాలజీకి డిమాండ్ ఉన్న ప్రాంతాలలో కంపెనీలు కొత్త ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. యాక్సెంచర్ సంస్థకు ఇప్పటికి 70శాతం రెవెన్యూ డిజిటల్ సేవల నుంచి లభిస్తున్నాయి.

Published date : 28 Sep 2020 12:06PM