ఉద్యోగాల భర్తీపై అపోహలొద్దు: వినోద్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీపై ఎలాంటి అపోహలొద్దని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్ పేర్కొన్నారు.
ఒక ప్రొఫెసర్‌గా పనిచేసిన టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంలాంటి వ్యక్తులు ఉద్యోగాల భర్తీపై అపోహలున్నాయనడం శ్రేయస్కరం కాదని వ్యాఖ్యానించారు. కేసీఆర్ చిత్తశుద్ధిని ఎవరూ శంకించాల్సిన పనిలేదని, రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను పక్కాగా అమలు చేస్తూ జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. భర్తీపై సీఎం కేసీఆర్ ప్రత్యేక సమావేశాలు, సీఎస్ సమీక్షలు చూస్తుంటే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగం స్పష్టమవుతుందని తెలిపారు.
Published date : 17 Dec 2020 04:37PM