Skip to main content

ఉద్యోగ నియామకాల్లో 62 శాతం క్షీణత: నౌకరీ

ముంబై: భారతదేశంలో ఉద్యోగ నియామకాలు ఈ ఏడాది ఏప్రిల్‌లో ఏకంగా 62 శాతం తగ్గాయని నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ వెల్లడించింది.
ఈ సంస్థ వెబ్‌సైట్‌లో నమోదైన కంపెనీల వివరాల ఆధారంగా తాజా గణాంకాలను వెల్లడించింది. గత నెలలో 951 నియామకాలు జరగ్గా, అంతక్రితం ఏడాది ఇదేకాలంలో 2,477 నియామకాలు పూర్తయ్యాయి. ఎయిర్‌లైన్స్, హోటల్, రెస్టారెంట్, ట్రావెల్ రంగాల్లో 91% తగ్గుదల ఉండగా.. ఆటో రంగంలో 82 శాతం క్షీణత చోటుచేసుకుంది. రిటైల్ రంగంలో 77%.. అకౌంటింగ్, ఫైనాన్స్ రంగాల్లో 70% తగ్గాయి. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఈ స్థాయిలో క్షీణత ఉన్నట్లు సంస్థ వివరించింది.
Published date : 07 May 2020 05:29PM

Photo Stories