Skip to main content

తొలిసారిగా గరిష్ఠ సంఖ్యలో వైద్య సిబ్బంది నియామకాలు: మొత్తం 7,634 రెగ్యులర్ పోస్టులు!

సాక్షి, అమరావతి: గత ప్రభుత్వం ప్రభుత్వ ఆస్పత్రులను నిర్వీర్యం చేసి, పరోక్షంగా ప్రైవేట్ ఆస్పత్రులను ప్రోత్సహిస్తే, ప్రస్తుత ప్రభుత్వం అందుకు భిన్నంగా ప్రభుత్వ ఆస్పత్రులను కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంది.
రాష్ట్ర, జిల్లా స్థాయిలో డాక్టర్లు, వైద్య సిబ్బందిని పెద్ద సంఖ్యలో నియమించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర, జిల్లా స్థాయి ఆస్పత్రుల్లో ఏకంగా 7,634 రెగ్యులర్ పోస్టులను భర్తీ చేశారు. జిల్లా స్థాయిలో డెరైక్టర్ మెడికల్ విద్య, ఏపీ వైద్య విధాన పరిషత్, డెరైక్టర్ పబ్లిక్ హెల్త్ కింద ఆస్పత్రుల్లో మొత్తం 7,590 రెగ్యులర్ పోస్టుల భర్తీకి అనుమతించగా ఇప్పటి వరకు 6,106 పోస్టులను భర్తీ చేశారు. రాష్ట్ర స్థాయిలో డెరైక్టర్ మెడికల్ విద్య, ఏపీ వైద్య విధాన పరిషత్, డెరైక్టర్ పబ్లిక్ హెల్త్ కింద 2,120 పోస్టులు మంజూరు చేయగా ఇప్పటి వరకు 1,528 పోస్టులను భర్తీ చేశారు. మిగతా 592 పోస్టుల భర్తీ ప్రాసెస్‌లో ఉన్నట్లు వైద్య శాఖ వర్గాలు తెలిపాయి. దీనిని బట్టి ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రజారోగ్యం పట్ల ముఖ్యమంత్రికి ఉన్న చిత్తశుద్ధి స్పష్టం అవుతోందని వైద్య శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. జిల్లా స్థాయిలో మిగతా పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని, వీలైనంత త్వరగా భర్తీ ప్రక్రియ పూర్తి చేయనున్నారు.

రాష్ట్ర స్థాయిలో మంజూరైన పోస్టులు, భర్తీ అయినవి

శాఖ

కేడర్

మంజూరు

భర్తీ

డెరైక్టర్ మెడికల్ విద్య

అసిస్టెంట్ ప్రొఫెసర్

737

695

ఏపీ వైద్య విధాన పరిషత్

సివిల్ అసిస్టెంట్ సర్జన్స్‌ స్పెషలిస్ట్

692

218

------

డెంటల్ అసిస్టెంట్ సర్జన్స్‌

26

--

డెరైక్టర్ పబ్లిక్ హెల్త్

సివిల్ అసిస్టెంట్ సర్జన్స్‌ స్పెషలిస్ట్

665

615

మొత్తం

------

2120

1,528


జిల్లా స్థాయిలో రెగ్యులర్ పోస్టుల వివరాలు

జిల్లా

డీఎంఈ పోస్టుల కేటాయింపు

పోస్టుల భర్తీ

ఏపీవీవీపీ పోస్టుల కేటాయింపు

పోస్టుల భర్తీ

డీపీహెచ్ పోస్టుల కేటాయింపు

పోస్టుల భర్తీ

శ్రీకాకుళం

214

195

95

79

166

144

విజయనగరం

 

 

124

119

127

126

విశాఖపట్నం

962

852

157

151

130

115

తూర్పుగోదావరి

322

289

130

125

314

308

పశ్చిమగోదావరి

 

 

72

53

182

145

కృష్ణా

355

101

71

47

217

205

గుంటూరు

292

176

65

28

207

195

ప్రకాశం

229

202

120

107

183

166

నెల్లూరు

54

31

68

23

196

85

చిత్తూరు

261

222

113

105

212

208

వైఎస్సార్

208

183

140

84

176

143

కర్నూలు

339

312

126

89

210

112

అనంతపురం

446

306

141

122

166

153

మొత్తం

3,682

2,869

1,422

1,132

2,486

2,105

Published date : 24 Dec 2020 05:08PM

Photo Stories