తెలంగాణ రవాణాశాఖలో ఉద్యోగాలు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: రవాణా శాఖలో పెద్ద సంఖ్యలో మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ (ఎంవీఐ) పోస్టులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది.
తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారి ఇంత పెద్ద సంఖ్యలో పదోన్నతులు కల్పించటం ద్వారా ఖాళీలను భర్తీచేయటం విశేషం. మొత్తం 87 పోస్టులను భర్తీ చేస్తూ రవాణాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర సరిహద్దులో వాహనాల తనిఖీ, ఆదాయం పెంపు లక్ష్యంగా ఈ ఖాళీలను భర్తీ చేసినట్లు ఉత్తర్వులో పేర్కొంది. దీంతో ప్రస్తుతమున్న మోటారు వెహికిల్ ఇన్‌స్పెక్టర్ పోస్టులన్నీ భర్తీ అయ్యాయి. ఎవరైనా పదవీ విరమణ పొందితేనే కొత్తగా ఖాళీలు ఏర్పడతాయి. పదోన్నతులు పొందిన వారిని ఆన్‌డ్యూటీగా అవసరమైన ప్రాంతాల్లో నియమించారు. ఈ పదోన్నతులతో ఖాళీ అయిన అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు సమాచారం.
Published date : 07 Dec 2020 04:51PM