Skip to main content

టెకీలకు యాక్సెంచర్ భారీ షాక్‌..

బెంగుళూరు: ఐటీ సర్వీసుల గ్లోబల్‌ దిగ్గజం యాక్సెంచర్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది.
కంపెనీలో పనిచేసే 5 శాతం ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు ఆస్ట్రేలియన్ ఫైనాన్షియల్ రివ్యూ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 5లక్షల టెకీలకు ఉద్యోగాలు కల్పిస్తున్నయాక్సెంచర్, భారత్‌లో 2లక్షల టెకీలకు ఉద్యోగాలు కల్పిస్తుంది. సంస్థ అంతర్గత సమావేశంలో కాంట్రాక్ట్‌లను తగ్గించడంతో పాటు, కొత్త నియామకాలు చేపట్టకుండా ప్రస్తుతం పని చేస్తున్న నైపుణ్యం లేని ఉద్యోగులకు ఉద్వాసన పలకాలని భావిస్తోంది. క్లయింట్లకు కేటాయించాల్సిన పనిగంటలు భారీగా తగ్గాయని, నైపుణ్యం కలిగిన టెకీల ఉద్యోగాలకు ఎలాంటి డోకా ఉండదని సంస్థ ఉన్నతాధికారులు తెలిపారు. కాగా యాక్సెంచర్‌లో ఉద్యోగాల కోత ఉంటుందని జులై 1న గార్డియన్‌ అనే నివేదిక తెలిపింది. అయితే వృధా ఖర్చును తగ్గించడానికి ప్రయత్నిస్తున్నామని, సప్లై, డిమాండ్‌ మధ్య వ్యత్యాసం లేకుండా చూస్తామని సంస్థ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఇటీవల కాలంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో దిగ్గజ ఐటీ కంపెనీలు కాగ్నిజెంట్‌, ఐబీఎమ్‌ ఉద్యోగులకు ఉద్వాసన పలికిన విషయం తెలిసిందే.
Published date : 28 Aug 2020 03:26PM

Photo Stories