Skip to main content

సింగరేణిలో ఉద్యోగాలు..అర్హతలు ఇవే..

సాక్షి, హైదరాబాద్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ రెండు డిప్యూటీ లా మేనేజర్, రెండు సీనియర్ ‘లా’ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
60 శాతం మార్కులతో ఎల్‌ఎల్‌బీ/బీఎల్ పూర్తి చేసినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు లీగల్ ప్రాక్టీషనర్‌గా పని చేసిన అనుభవం ఉండాలి. ఈ పోస్టులకు డిసెంబర్ 12 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. డిసెంబర్ 17లోగా కొత్తగూడెంలోని సింగరేణి కార్యాలయానికి పంపాలి. పూర్తి వివరాలకు వెబ్‌సైట్ https://scclmines.com చూడొచ్చు.
Published date : 07 Dec 2020 04:44PM

Photo Stories