సీఎం జగన్‌ను కలిసిన ‘డీఎస్సీ-2008’ అభ్యర్థులు...సీఎం నిర్ణయించారంటే..?
Sakshi Education
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ‘డీఎస్సీ-2008’ అభ్యర్థులు కలిశారు.
తమకు జరిగిన నష్టాన్ని ముఖ్యమంత్రికి డీఎస్సీ అభ్యర్థులు వివరించారు. న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటామని వారికి సీఎం వైఎస్ జగన్ తెలిపారు.
అధికారులకు సీఎం జగన్..
అనంతరం ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, 2008 డీఎస్సీలో అభ్యర్థులకు జరిగిన నష్టాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లామని, కాంట్రాక్ట్ బేసిక్ మీద తీసుకోవాలని సీఎం నిర్ణయించారని తెలిపారు. సీఎం జగన్ నిర్ణయంతో 2,193 మందికి లబ్ధి చేకూరిందన్నారు. సచివాలయం ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని కోరామని.. రెగ్యులర్ చేయాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలిచ్చారని వెంట్రామిరెడ్డి వెల్లడించారు.

Published date : 09 Jun 2021 05:47PM