పండిట్, పీఈటీల అప్‌గ్రెడేషన్ అమలులో జీవోలిచ్చినా.. జాప్యమేల?
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భాషా పండితులు, పీఈటీల అప్‌గ్రెడేషన్ ప్రక్రియ ఏళ్ల తరబడి జీవోలకే పరిమతం అవుతోంది తప్ప అమలుకు నోచుకోవడం లేదు.
ప్రభుత్వం ఇప్పటికే మూడుసార్లు జీవోలు జారీచేసినా, ఒక్కోసారి ఒక్కో కారణంతో వాటి అమలు ఆగిపోతూనే ఉంది. కొన్నిసార్లు కోర్టు కేసులు, మరికొన్నిసార్లు విద్యాశాఖ జాప్యంతో అప్‌గ్రెడేషన్ ఆచరణరూపం దాల్చడం లేదు. తాజాగా ప్రభుత్వం స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్ పోస్టులు పండితులకేనని, స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ డైరె క్టర్) పోస్టులు పీఈటీలకేనని ఉత్తర్వులు జారీ చేసింది. అయినా జాప్యం జరుగుతుండటంతో తమకు ఈసారైనా పదోన్నతులు లభిస్తాయో లేదోనని పండిట్లు, పీఈటీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రం లోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పని చేస్తున్న 8,630 మంది గ్రేడ్–2 పండిట్ పోస్టులను స్కూల్ అసిస్టెంట్లుగా (తెలుగు, హిందీ, ఉర్దూ), 1,849 పీఈటీల పోస్టులను స్కూల్ అసిస్టెంట్లుగా (ఫిజికల్ డైరెక్టర్) మార్పు చేయాలని పండిట్లు, పీఈటీలు పదేళ్లుగా విజ్ఞప్తి చేస్తున్నారు. 2017లో జరిగిన తెలుగు మహాసభల సందర్భంగా ఆ పోస్టులను అప్‌గ్రేడ్ చేస్తామని, పండిట్లకు న్యాయం చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అదే ఏడాది జీవో 17, 18ని ప్రభుత్వం జారీ చేసింది. అందులో 2,680 పండిట్, 1,047 పీఈటీ పోస్టులనే అప్‌గ్రేడ్ చేసింది. దీనిపై సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్‌జీటీ) కోర్టును ఆశ్రయించారు. జీవో 11, 12ను సవరించకుండా పండితులకు, పీఈటీలకు పదోన్నతులు ఎలా ఇస్తారని కోర్టు ప్రశ్నించింది. ఆ జీవోలను సవరించి పండిట్, పీఈటీలకు పదోన్నతులు ఇచ్చుకోవచ్చని సూచించింది. అయితే జీవో 11, 12 ప్రకారం.... పోస్టు గ్రాడ్యుయేషన్‌లో (పీజీ) తెలుగు మెథడాలజీ, హిందీ, ఉర్దూ సబ్జెక్టులు కలిగిన వారూ స్కూల్ అసిస్టెంట్ (ఎస్‌ఏ) తెలుగు, ఎస్‌ఏ– ఉర్దూ, ఎస్‌ఏ–హిందీ పోస్టుల్లో పదోన్నతి పొందేందుకు అర్హులు. దీంతో ప్రత్యేకంగా పండిట్ కోర్సులు చదివిన తమకు అన్యాయం జరుగుతోందని భాషా పండితులు ఆవేదన చెందుతున్నారు. ఈ అంశంపై వారు పలుమార్లు ప్రభుత్వానికి విజ ్ఞప్తులు చేశారు. ఈ నేపథ్యంలో 8,630 పండిట్, 1,849 పీఈటీ పోస్టులను అప్‌గ్రేడ్ చేస్తూ ప్రభు త్వం 2019లో జీవో 15ను జారీ చేసింది. అయితే అప్పటికీ జీవో 11, 12కు సవరణ చేయలేదు. దీంతో ఎస్‌జీటీలు మళ్లీ జీవో 15పైనా కోర్టును ఆశ్రయించారు.
దీంతో రూల్స్ మార్చుకొమ్మని చెప్పినా చేయలేదని, వాటిని మార్చుకున్న తరువాతే గ్రేడ్–2 పండిట్, పీఈటీ పోస్టులను అప్‌గ్రేడ్ చేయాలని కోర్టు మళ్లీ చెప్పింది. దీంతో 11, 12 జీవోలను సవరిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 5న ప్రభుత్వం జీవో 2, 3లను జారీ చేసింది. స్కూల్ అసిస్టెంట్ తెలుగు, ఉర్దూ, హిందీ పోస్టుల్లో పదోన్నతులకు పండితులే అర్హులని స్పష్టం చేసింది. అలాగే స్కూల్ అíసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్–పీడీ) పోస్టులకి పీఈటీలే అర్హులని 9, 10 జీవోలను జారీ చేసింది. దీంతో పం డిట్, పీఈటీల అప్‌గ్రెడేషన్, పదోన్నతులకు మా ర్గం సుగమమైంది. అయినా పదోన్నతులు కలి్పంచేందుకు విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేయలేదు. అదే సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావ డంతో ప్రక్రియ ఆగిపోయింది. ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకుంటామని చెప్పినా తీసుకోలేదు. ఆ ఎన్నికలు పూర్తయినా ఇంతవరకు ఎలాంటి చర్య లు చేపట్టలేదు. ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ, న్యాయ శాఖనుంచి అన్ని అనుమతులు లభించినా æతమకు పదోన్నతులు ఎందుకు ఇవ్వడం లేదని భాషా పండితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏజెన్సీ ప్రాంతాల్లో పదోన్నతులు ఎలా ఇవ్వాలనే విషయంలో ప్రభుత్వ ఆమోదం కోసం లేఖ రాసినట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.

Published date : 05 Apr 2021 05:35PM