నిరుద్యోగులకు శుభవార్త! మొత్తం 358 ఉద్యోగాలకు మార్చి 31న ఉద్యోగ మేళ... వివరాలివిగో..
Sakshi Education
సాక్షి, ఎడ్యుకేషన్: సూర్యపేటలోని జిల్లా ఎంప్లాయ్‌మెంట్ కార్యాలయం ఆద్వర్యంలో ఈ నెల 31న ఉద్యోగ మేళ నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.
మొత్తం 358 ఉద్యోగాలకు గాను వివిధ కంపెనీలు ఈ ఉద్యోగ మేళలో పాల్గొననున్నాయి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు మార్చి 31న ఉదయం 10 : 00 గంటలకు ఒరిజినల్, జీరాక్స్ సర్టిఫికేట్లు, ఆధార్ కార్డుతో పాటు ప్రకటనలో సూచించిన ఇతర సర్టిఫికేట్లతో సూర్యపేటలోని సుధా బ్యాంక్ పక్కన ఉన్న వాణిజ్య భవన్‌లో నిర్వహించే ఉద్యోగ మేళకు హాజరు కావల్సిందిగా పేర్కొన్నారు. ఇతర వివరాలకు 9441993390 సంప్రదించవచ్చు. 18 నుంచి 35 ఏళ్లలోపున్న నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పూర్తి సమాచారం కోసం ఈ కింది ప్రకటనను చదవండి.
Published date : 27 Mar 2021 03:31PM