Skip to main content

HPCL Recruitment: బయోఫ్యూయల్స్‌లో 255 పోస్టులు.. దరఖాస్తుల‌కు చివరి తేదీ ఇదే..

HPCL Biofuels Limited

హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌(హెచ్‌పీసీఎల్‌) సబ్సిడరీ సంస్థ అయిన హెచ్‌పీసీఎల్‌ బయోఫ్యూయల్స్‌ లిమిటెడ్‌ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 255
పోస్టులు: జనరల్‌ మేనేజర్, మెకానికల్‌ ఇంజనీర్, సాయిల్‌ అనలిస్ట్, ఇన్విరాన్‌మెంటల్‌ ఆఫీసర్, ఈడీపీ ఆఫీసర్, బాయిలర్‌ అటెండెంట్, ఫిట్టర్, రిగ్గర్, కేన్‌ క్లర్క్, ఈటీపీ ఆపరేటర్, ల్యాబ్‌ కెమిస్ట్‌ తదితరాలు.
విభాగాలు: జనరల్‌ అండ్‌ అడ్మినిస్ట్రేషన్, షుగర్‌ ఇంజనీరింగ్, ఫైనాన్స్, ఈడీపీ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, సంబంధిత ట్రేడుల్లో/సబ్జెక్టుల్లో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, ఇంజనీరింగ్‌ డిగ్రీ, ఎంబీఏ, మాస్టర్స్‌ డిగ్రీ, ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 01.09.2021 నాటికి కనీస వయసు 18 నుంచి గరిష్ట వయసు 57 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, స్కిల్‌ టెస్ట్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. 

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును హెచ్‌పీసీఎల్‌ బయోఫ్యూయల్స్‌ లిమిటెడ్, హౌస్‌ నెం.09, శ్రీ సదన్, పాటలీపుత్ర కాలనీ, పాట్నా–800013 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 16.10.2021

వెబ్‌సైట్‌: http://www.hpclbiofuels.co.in/

చ‌ద‌వండి: BECIL Recruitment: బీఈసీఐఎల్‌లో సూపర్‌వైజర్‌ పోస్టులు.. దరఖాస్తు వివరాలు ఇలా..

Qualification 10TH
Last Date October 16,2021
Experience 1 year
For more details, Click here

Photo Stories