మార్చి 31 వరకు కాంట్రాక్టు ఉద్యోగుల కొనసాగింపు
Sakshi Education
సాక్షి, అమరావతి: సచివాలయంలోని వివిధ శాఖలు, రాష్ట్ర విభాగాధిపతులు, జిల్లాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును వచ్చే ఏడాది మార్చి 31 వరకు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
వాస్తవానికి ఈ ఏడాది జూన్‌తో కాంట్రాక్టు ఉద్యోగుల పదవీకాలం ముగిసింది. అనంతరం ప్రభుత్వం వీరిని ఆగస్టు వరకు కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా వీరిని మార్చి 31 వరకు కొనసాగించబోతోంది. ఈ మేరకు ఆర్థిక శాఖ గురువారం ఉత్తర్వులిచ్చింది.
Published date : 04 Dec 2020 04:22PM