కరోనా ఎఫెక్ట్ : ఉద్యోగాలు, జీతాల్లో కోత
Sakshi Education
సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతకమైన కరోనా వైరస్ ప్రభావం వల్ల భారతదేశంలో నిరుద్యోగుల సంఖ్య ఎన్నడులేని విధంగా 26 శాతానికి చేరుకుందని 'సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమి' వెల్లడించింది.
మున్ముందు దేశంలోని 70 శాతం కంపెనీలు ఉద్యోగుల సంఖ్యలో కోత విధిస్తాయని, 50 శాతం కంపెనీలు వేతనాలను తగ్గిస్థాయని 'ఫిక్కీ–ధృవ' నిర్వహించిన ఓ పారిశ్రామిక అధ్యయనంలో తేలింది.
కరోనా సంక్షోభంలో ప్రజలను ఆదుకునేందుకు అమెరికా 1500 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించగా.. బ్రిటన్ ప్రభుత్వం ఆపద్ధర్మంగా 500 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. భారత్ కేవలం 1.7 లక్షల కోట్ల రూపాయలను ప్రకటించింది. దేశ ఆర్థిక వ్యవస్థ బాగో లేకపోవడం వల్లనే భారత్ అతి తక్కువ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాల్సి వచ్చిందని ఆర్థిక నిపుణలు చెబుతున్నారు.

Published date : 24 Apr 2020 07:29PM