Skip to main content

కరోనా ఎఫెక్ట్‌: 60 లక్షల ఉద్యోగులను తొల‌గింపు

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి.
అయితే మే, ఆగస్ట్‌ నెలలో 60 లక్షల మంది వైట్‌ కాలర్‌ ఉద్యోగులకు( ఐటీ ఉద్యోగులు, ఇంజనీర్స్, టీచర్స్‌, అకౌంటెంట్స్‌, అనలిస్ట్స్‌) సంస్థలు ఉద్వాసన పలికినట్లు సెంటర్ ఫర్ మానీటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) పేర్కొంది. కరోనా వైరస్‌ను నివారించేందుకు లాక్‌డౌన్‌ విధించడం వల్ల ఆర్థిక కార్యకలాపాలు నెమ్మదించాయి. ఈ నేపథ్యంలో సంస్థలు భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అయితే 2016లో కంపెనీలు 12కోట్ల 50లక్షల వైట్‌ కాలర్‌ ఉద్యోగులను నియమించగా, 2019లో భారీగా 18కోట్ల 70లక్షల ఉద్యోగులను నియమించాయి. కాగా సీఎంఐఈ సర్వేను మే నుంచి ఆగస్ట్‌ నెల వరకు నిర్వహించారు. మరోవైపు కరోనా కారణంగా చిన్న తరహా పరిశ్రమలలో భారీ సంఖ్యలో సంస్థలు ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి.
Published date : 18 Sep 2020 05:30PM

Photo Stories