Skip to main content

కొత్తగా 9,000 మందికి ఉద్యోగాలు..ఈ అర్హతతోనే

ముంబై: ఎర్నెస్ట్ అండ్ యంగ్ సర్వీసెస్ (ఈవై) 2021లో వివిధ టెక్నాలజీ విభాగాల్లో 9,000 మంది నిపుణులను భారత్‌లో నియమించుకోనున్నట్టు ప్రకటించింది.
సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమేటిక్స్ (స్టెమ్) కోర్సులు చదివిన వారు, కృత్రిమ మేథ (ఏఐ), మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, అనలైటిక్స్, ఇతర ఆధునిక టెక్నాలజీలకు సంబంధించి ఈ నియామకాలు ఉంటాయని ఈవై తెలిపింది. ‘‘ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని మా క్లయింట్లు టెక్నాలజీ ఆధారిత పరివర్తనం దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ ప్రయాణంలో వారికి మేము మద్దతుగా నిలవాల్సి ఉంటుంది. అత్యాధునిక టెక్నాలజీ బాధ్యతలు నిర్వహించేందుకు వీలుగా మా సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటున్నాము. కనుక రానున్న సంవత్సరంలో నియామకాలను గణనీయంగా పెంచబోతున్నాము’’ అంటూ ఈవై ఇండియా పార్ట్‌నర్ రోహన్ సచ్‌దేవ్ తెలిపారు. ప్రస్తుతం ఈవై ఇండియా పరిధిలో 50,000 మంది పనిచేస్తున్నారు. వీరిలో 36 శాతం స్టెమ్ విభాగానికి చెందిన వారే ఉన్నారు.
Published date : 28 Dec 2020 05:38PM

Photo Stories