కొలువుల జోరు.. కార్పొరేట్ కంపెనీల్లో ఊపందుకున్న ఉద్యోగ నియామకాలు
Sakshi Education
సాక్షి, అమరావతి: దేశంలోని కార్పొరేట్ రంగంలో ఉద్యోగ నియామకాలు జోరందుకున్నాయి.
కరోనా మహమ్మారి, లాక్‌డౌన్ అనంతర పరిస్థితులతో కొన్ని నెలలుగా నెమ్మదించిన ఉద్యోగ నియామకాలు తిరిగి గాడిన పడుతున్నాయి. ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాలు మళ్లీ ఊపందుకోవడంతో ఐటీ, భారీ పరిశ్రమలు, ఫైనాన్షియల్-బ్యాంకింగ్, సేవా రంగాలకు చెందిన ప్రధాన కంపెనీలతోపాటు స్టార్టప్ కంపెనీలు రెండు నెలలుగా పెద్దఎత్తున నియామకాలు చేపట్టాయని ప్రముఖ మార్కెట్ కన్సల్టెన్సీ ‘కంపెనీ డేటా-సర్వే’ నివేదిక వెల్లడించింది.
గడిచిన రెండు నెలల్లో 40 వేల ఉద్యోగాలు
దాదాపు ఐదు నెలల విరామం అనంతరం సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కార్పొరేట్ కంపెనీలు పెద్దఎత్తున ఉద్యోగ నియామకాలు చేపట్టాయి. క్యాప్ జెమిని, టాటా స్టీల్, వేదాంత, ఫిలిప్స్, నెస్ట్లే, డెలాయిట్, పెప్సీ కో తదితర సంస్థలు ఉద్యోగ నియామకాల ప్రక్రియ పునఃప్రారంభించాయి. ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నతస్థాయి ఉద్యోగాల వరకూ నియామకాలు చేపట్టాయి. గడిచిన రెండు నెలల్లో దాదాపు 40 వేల ఉద్యోగులను నియమించినట్టు నివేదిక వెల్లడిస్తోంది. ఇది గత ఏడాది కంటే 22 శాతం ఎక్కువ కావడం విశేషం.
స్టార్టప్‌ల జోరుతో హుషారు
ఇక ప్రధాన కంపెనీలకు దీటుగా దేశంలో స్టార్టప్ కంపెనీలు కూడా పెద్దఎత్తున ఉద్యోగుల నియామక ప్రక్రియ చేపట్టాయి. జూలై నుంచి నియామకాలు మొదలు పెట్టిన ఈ కంపెనీలు సెప్టెంబర్, అక్టోబర్‌లో మరింత జోరు పెంచాయి. బైజూస్, డెల్లివరి, ఉడాన్, ఫోన్ పే, అన్ అకాడమీ, బిగ్ బాస్కెట్, జొమాటో, వేదాంతు సహా 80 శాతం స్టార్టప్ కంపెనీలు 22 శాతం ఉద్యోగులను నియమించాయి. ఈ రంగంలో గత ఏడాది ఈ కాలంలో 14 శాతం ఉద్యోగాలే లభించాయి. ప్రధానంగా డిజిటల్ కంటెంట్, ఇ-లెర్నింగ్ ప్లాట్‌ఫామ్‌లు నిర్వహించే స్టార్టప్ కంపెనీలు ఏకంగా 78 శాతం కొత్త ఉద్యోగాలు కల్పించడం విశేషం. ఫైనాన్షియల్ సర్వీసులు అందించే స్టార్టప్‌లు కూడా 7 వేల మంది వరకు ఉద్యోగులను నియమించాయి. నియామకాల ప్రక్రియను వచ్చే ఏడాది మార్చి వరకూ కొనసాగించే ఉద్దేశంతో ఉన్నాయి.
నైపుణ్యాలు పెంచుకోండి
దేశంలోని కార్పొరేట్ రంగంలో ఉద్యోగ నియామకాలు మళ్లీ ఊపందుకున్నాయి. ప్రధానంగా ఐటీ, ఆర్థిక, సేవా రంగాల్లో విశేష అవకాశాలున్నాయి. అందుకు అనుగుణంగా యువత అదనపు నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. కరోనా అనంతర పరిస్థితుల్లో మార్కెట్‌లో కొత్తగా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.
- ప్రసాద్‌రెడ్డి, వీసీ, ఆంధ్రా విశ్వవిద్యాలయం

Published date : 13 Nov 2020 04:08PM