United India Insurance Jobs : నెలకు రూ.88 వేల వేతనంతో 200 ఏఓ పోస్ట్‌లకు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ నోటిఫికేషన్

200 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైతే నెలకు రూ.88 వేల వేతనం అందుకోవచ్చు!! ఈ నేపథ్యంలో.. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఏఓ ఉద్యోగాలు, దరఖాస్తుకు అర్హతలు, ఎంపిక విధానం, ప్రిపరేషన్ తదితర వివరాలు..
మొత్తం పోస్టులు 200
తాజా నోటిఫికేషన్ ద్వారా యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్.. రెండు విభాగాల్లో 200 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్ట్‌లను భర్తీ చేయనుంది. స్పెషలిస్ట్స్ కేడర్‌లో 100 పోస్ట్‌లు, జనరలిస్ట్ కేడర్‌లో మరో 100 పోస్ట్‌లు అందుబాటులో ఉన్నాయి. స్పెషలిస్ట్ కేడర్‌లో 100 పోస్ట్‌ల్లో రిస్క్ మేనేజ్‌మెంట్–10 పోస్ట్‌లు, ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్–20 పోస్ట్‌లు, ఆటోమొబైల్ ఇంజనీర్స్–20 పోస్ట్‌లు, కెమికల్ ఇంజనీర్స్/మెకట్రానిక్స్ ఇంజనీర్స్–10 పోస్ట్‌లు, డేటా అనలిటిక్స్–20 పోస్ట్‌లు, లీగల్–20 పోస్ట్‌లు ఉన్నాయి.
APSRTC Jobs Notification 2024 : 7545 ఉద్యోగాలకు నోటిఫికేషన్... ఎప్పుడంటే...?
అర్హతలు
ఆయా విభాగాలను అనుసరించి సంబంధిత సబ్జెక్ట్‌లో బీటెక్/ఎంటెక్/బ్యాచిలర్/ పీజీ డిగ్రీ/సీఏ/ఐసీడబ్ల్యూఏ/రిస్క్ మేనేజ్‌మెంట్ కోర్సులు ఉత్తీర్ణులవ్వాలి. ∙వయసు:2024 సెప్టెంబర్ 30 నాటికి 21–30 ఏళ్లు ఉండాలి. గరిష్ట వయో పరిమితిలో ఎస్‌సీ/ఎస్‌టీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు చొప్పున గరిష్ట వయో పరిమితిలో సడలింపు లభిస్తుంది.
రాత పరీక్షల వివరాలు
ఎంపిక ప్రక్రియలో తొలి దశ రాత పరీక్షను స్పెషలిస్ట్, జనరలిస్ట్ కేడర్‌లకు వేర్వేరు విధానాల్లో నిర్వహిస్తారు.
250 మార్కులకు స్పెషలిస్ట్స్ రాత పరీక్ష
స్పెషలిస్ట్స్ రాత పరీక్షను ఆరు విభాగాల్లో 250 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో రీజనింగ్ (25 ప్రశ్నలు–25మార్కులు), ఇంగ్లిష్ లాంగ్వేజ్(40 ప్రశ్నలు–40 మార్కులు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్(25 ప్రశ్నలు–25 మార్కులు), జనరల్ అవేర్‌నెస్(20 ప్రశ్నలు–20 మార్కులు), కంప్యూటర్ నాలెడ్జ్(30 ప్రశ్నలు–20 మార్కులు), సంబంధిత సబ్జెక్ట్ నాలెడ్జ్ (60 ప్రశ్నలు–120 మార్కులు) విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్షకు కేటాయించిన సమయం గంటన్నర.
☛Follow our YouTube Channel (Click Here)
జనరలిస్ట్ ఏఓ రాత పరీక్ష ఇలా
జనరలిస్ట్ ఏఓ పోస్ట్‌లకు అయిదు విభాగాల్లో 250 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో రీజనింగ్ (50 ప్రశ్నలు–50 మార్కులు), ఇంగ్లిష్ లాంగ్వేజ్ (50 ప్రశ్నలు– 60 మార్కులు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (40 ప్రశ్నలు–50 మార్కులు), జనరల్ అవేర్‌నెస్(40 ప్రశ్నలు–50 మార్కులు), కంప్యూటర్ నాలెడ్జ్ (20 ప్రశ్నలు–40 మార్కులు) విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. రెండు విభాగాలకు నిర్వహించే రాత పరీక్ష పూర్తిగా
ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది.
డిస్క్రిప్టివ్ టెస్ట్
ఆబ్జెక్టివ్ టెస్ట్‌తోపాటు అదనంగా 30 మార్కులకు డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా నిర్వహిస్తారు. లెటర్ రైటింగ్(10 మార్కులు),ఎస్సే రైటింగ్ (20 మార్కులు) విభాగాల్లో ఈ వ్యాస రూప పరీక్ష ఉంటుంది.
మలి దశలో ఇంటర్వ్యూ
రాత పరీక్షలోని ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ విభాగాల్లో చూపిన ప్రతిభ ఆధారంగా.. మలి దశలో 100 మార్కులకు పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందులో ఇన్సూరెన్స్ రంగంపై ఉన్న పరిజ్ఞానం, ఆసక్తి, భవిష్యత్తు లక్ష్యాలు, ఆయా స్పెషలైజ్డ్ విభాగాల్లో ఉన్న పని అనుభవం, నైపుణ్యంపై ప్రశ్నలు అడుగుతారు.
Yantra India Ltd : యంత్ర ఇండియా లిమిటెడ్‌లో 3,883 ట్రేడ్ అప్రెంటిస్ శిక్షణకు దరఖాస్తులు
తుది జాబితా
పర్సనల్ ఇంటర్వ్యూ ముగిసిన తర్వాత తుది జాబితా రూపకల్సనలో వెయిటేజీ విధానాన్ని అనుసరిస్తారు. రాత పరీక్షలో పొందిన మార్కులకు 75 శాతం వెయిటేజీ, పర్సనల్ ఇంటర్వ్యూలో సాధించిన మార్కులకు 25 శాతం వెయిటేజీ కల్పించి.. తుది జాబితా రూపొందిస్తారు. ఈ జాబితాలో నిలిచిన వారికి నియామకాలు ఖరారు చేస్తారు.
ఏడాది ప్రొబేషన్
నియామకం ఖరారు చేసుకున్న అభ్యర్థులకు ఏడాదిపాటు ప్రొబేషనరీ పిరియడ్ నిబంధన ఉంది. ఈ సమయంలో అభ్యర్థులు ఇన్సూరెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నిర్వహించే లైసెన్సియేట్ ఎగ్జామినేషన్‌లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. అదే విధంగా.. ప్రొబేషన్ పిరియడ్‌తో కలిపి అయిదేళ్లపాటు సంస్థలో విధులు నిర్వహిస్తామని సర్వీస్ బాండ్ కూడా ఇవ్వాలి.
☛ Follow our Instagram Page (Click Here)
ఆకర్షణీయ వేతనం
యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కొలువులు సొంతం చేసుకున్న వారికి ఆకర్షణీయ వేతనం అందిస్తారు. నెలకు రూ.50,925–రూ.96,765 శ్రేణిలో ప్రారంభ వేతనం ఉంటుంది. దీనికి అదనంగా ఇతర భత్యాలు లభిస్తాయి. నికరంగా నెలకు రూ.88 వేల వేతనం చేతికందుతుంది.
జీఎం స్థాయికి చేరుకునే అవకాశం
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా కెరీర్ ప్రారంభించిన వారు భవిష్యత్తులో ఆయా విభాగాల్లో ఉన్నత హోదాలకు చేరుకునే అవకాశం ఉంది. తొలుత అయిదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్నాక.. పదోన్నతికి అర్హత లభిస్తుంది. అసిస్టెంట్ మేనేజర్/బ్రాంచ్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్/డివిజనల్ మేనేజర్; సీనియర్ డివిజనల్ మేనేజర్, చీఫ్ మేనేజర్, రీజనల్ మేనేజర్; డీజీఎం, జీఎం వంటి హోదాలకు చేరుకోవచ్చు. సీఏఐఐబీ నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిసేత వేగంగా పదోన్నతులు పొందే అవకాశం ఉంటుంది.
☛ Join our WhatsApp Channel (Click Here)
ముఖ్య సమాచారం
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 2024, నవంబర్5
ఆన్‌లైన్ రాత పరీక్ష తేదీ: 2024, డిసెంబర్ 14
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.uiic.co.in, https://uiic.co.in/recruitment/details/16167
రాత పరీక్షలో రాణించేలా
రీజనింగ్
రీజనింగ్ ప్రిపరేషన్ పరంగా అభ్యర్థులు పకడ్బందీగా వ్యవహరించాలి. సిరీస్, అనాలజీ, కోడింగ్–డీ కోడింగ్, డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్స్, ర్యాంకింగ్స్, సీటింగ్ అరేంజ్‌మెంట్స్, సిలాజిజమ్స్‌పై పట్టు సాధించాలి.
Union Bank Of India: యూనియన్ బ్యాంక్‌లో భారీ జీతం
ఇంగ్లిష్ లాంగ్వేజ్
రీడింగ్ కాంప్రహెన్షన్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, జంబుల్డ్ సెంటెన్సెస్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్ వంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. డిస్క్రిప్టివ్ విధానంలో ఉండే ఇంగ్లిష్ ఎస్సే రైటింగ్, లెటర్ రైటింగ్ కోసం ఇంగ్లిష్ న్యూస్ పేపర్లు చదవడం, ఎడిటోరియల్ లెటర్స్ చదవడం మేలు చేస్తుంది.
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్
ఈ విభాగానికి సంబంధించి అర్థమెటిక్‌పై పట్టు సాధించాలి. స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్, పర్సంటేజెస్, టైం అండ్ డిస్టెన్స్, టైం అండ్ వర్క్, ప్రాఫిట్ అండ్ లాస్, రేషియోస్ సంబంధిత ప్రశ్నలను బాగా ప్రాక్టీస్ చేయాలి. వీటితోపాటు నంబర్ సిరీస్, డేటా అనాలిసిస్ విభాగాలను కూడా బాగా ప్రాక్టీస్ చేస్తే.. ప్రిలిమ్స్, మెయిన్స్ రెండింటిలోనూ మంచి మార్కులు పొందే అవకాశం ఉంటుంది.
☛ Join our Telegram Channel (Click Here)
జనరల్ అవేర్‌నెస్
ఈ విభాగం కోసం అభ్యర్థులు మరింత ప్రత్యేక శ్రద్ధతో వ్యవహరించాలి. ఇన్సూరెన్స్, ఆర్థిక రంగంలో మార్పులు, ప్రకటిస్తున్న పథకాల గురించి తెలుసుకోవాలి. ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, మ్యూచువల్ ఫండ్స్, ఆర్థిక రంగంలో వినియోగించే పదజాలంపై పట్టు సాధించాలి.
స్పెషలిస్ట్ స్ట్రీమ్
స్పెషలిస్ట్ స్ట్రీమ్ విభాగంలో రాణించడానికి అభ్యర్థులు తమ సబ్జెక్ట్ స్పెషలైజేషన్‌కు సంబంధించి.. బ్యాచిలర్, పీజీ స్థాయి పుస్తకాలను అధ్యయనం చేయాలి. ముఖ్యమైన కాన్సెప్ట్‌లను అప్లికేషన్ అప్రోచ్‌తో అధ్యయనం చేస్తూ అడుగులు వేయాలి. ఆయా విభాగాలకు సంబంధించి గత ప్రశ్న పత్రాలు, ఇతర పోటీ పరీక్షల ప్రశ్న పత్రాలను సాధన చేయడం కూడా ఉపయుక్తంగా ఉంటుంది.
Tags
- Jobs 2024
- UIIC Recruitment 2024
- job notifications latest
- Insurance Sector
- United India Insurance Company Limited
- United India Insurance Company Limited recruitment
- job notification 2024
- Posts at UIICL
- administrative officer posts at uiicl
- online applications
- graduated and pg students
- degree and diploma eligibles
- entrance exam for uiicl jobs
- Education News
- Sakshi Education News